మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన “ఎల్2: ఎంపురాన్” సినిమా విడుదలైనప్పటి నుంచి ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ యంగ్ క్యారెక్టర్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించారనే వార్తలు వినిపించాయి. ఎంపురాన్ క్లైమాక్స్‌లో “ఎల్3: ది బిగినింగ్” అని టైటిల్ పడే ముందు స్టీఫెన్ గట్టుపల్లి యంగ్ లైఫ్ గురించి చిన్న టీజర్ చూపించడంతో, యంగ్ మోహన్ లాల్ పాత్ర ఎవరు పోషించారనే అనుమానాలు చెలరేగాయి.
ఈ వార్తలపై ఎల్2 డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా “ఎల్2లో మోహన్ లాల్ యంగ్ పాత్రను ఎవరో కాదు, ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ పోషించారని” ప్రకటించారు. ఇది “ఎల్3: ది బిగినింగ్” లో ప్రణవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సంకేతం. ప్రణవ్ ఇప్పటికే “హృదయం” మరియు “వర్షంగల్కు శేషం” వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. దీంతో ఎల్2లో ఏఐ ఉపయోగించలేదని స్పష్టమైంది.

ఎల్ఎల్2 విడుదల తరువాత కొన్ని సన్నివేశాల్లో మతాన్ని కించపరిచే విధంగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదవడంతో, చిత్ర యూనిట్ కొన్ని మార్పులు చేసి సెన్సార్‌ను ఆశ్రయించింది. ఏ వివాదాలున్నప్పటికీ “ఎల్2: ఎంపురాన్” బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ మలయాళ సినీ పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది.

One thought on “ఎల్2: ఎంపురాన్ లో మోహన్ లాల్ యంగ్ పాత్ర వెనుక నిజం”
Comments are closed.