అప్పుల బాధతో ముగ్గురు కుమార్తెలను చంపి ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ముగ్గురు కన్న కూతుళ్లను గొంతు కోసి చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లా, రాసిపురం పట్టణంలో జరిగింది.

ఘటన వివరాలు:

స్థానిక సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి తన భార్యను, కుమారుడిని ఒక గదిలో బంధించాడు. అనంతరం తన ముగ్గురు కుమార్తెలు నిద్రపోతున్న సమయంలో వారి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో రాసిపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More : యూపీఐ రికార్డు సృష్టి