సూర్యాపేటలోని ప్రముఖ జువెలరీ షాపులో భారీ దొంగతనం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న సాయి సంతోషి జువెలరీ షాపును లక్ష్యంగా చేసుకున్న దుండగులు, షాపు వెనుకభాగంలో ఉన్న బాత్రూమ్ గోడకు రంధ్రం వేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం షాపులో ఉన్న బీరువాను గ్యాస్ కట్టర్ సాయంతో కోసి అందులో ఉన్న విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దాదాపు 18 కేజీల బంగారాన్ని దొంగలించినట్టు ప్రాథమిక అంచనాలు.
ఈ ఘటనపై బాధిత షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.
మోసగాళ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read More : హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవితల ప్రమేయం ఉందని ఆరోపణ ?
