సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (DSRP) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్టకు గండిపడే ప్రమాదం ఉందని ప్యానెల్ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది.
కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు:
- మరమ్మత్తుల సూచన: ప్రాజెక్టు ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్‌మెంట్ (రాతి నిర్మాణం)కు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని కమిటీ సూచించింది.
- కారణం ఇదే: ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని కమిటీ నిర్ధారించింది.
- నీటి నిల్వ సామర్థ్యం: 1976లో ప్రాజెక్టును నిర్మించినప్పుడు దాని గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 517 మీటర్లు.
- జీవో జారీ: అయితే, 2017లో గత ప్రభుత్వం మిషన్ భగీరథ అవసరాల కోసం నీటి సామర్థ్యాన్ని 520 మీటర్లకు పెంచుతూ జీవో జారీ చేసింది. కొన్నిసార్లు 522 మీటర్ల వరకు కూడా నీటిని నిల్వ చేయడంతో ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడిందని కమిటీ అభిప్రాయపడింది.
ఈ ఏడాది జూన్ 23న డ్యామ్‌ను పరిశీలించిన DSRP కమిటీ, తాజాగా ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు ఇంజినీర్లు కోరుతున్నారు.
Read More : జనగామలో దారుణం: తల్లి, కుమార్తె దారుణ హత్య

One thought on “సింగూరు ప్రాజెక్టుకు ముప్పు”
Comments are closed.