హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవితల ప్రమేయం ఉందని ఆరోపణ ?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరిగిన అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఎమ్మెల్సీ కవితల ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్లుగా రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను ఈ ఇద్దరూ తమ వశంలో ఉంచుకున్నారని మండిపడ్డారు.

అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల పలు గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశం లేకుండా చేసారని ఆరోపించారు. హెచ్‌సీఏలో వచ్చిన నిధుల ఖర్చుపై స్పష్టత లేకపోవడాన్ని కూడా ప్రశ్నించిన ఆయన, ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కేటీఆర్, కవిత, సంపత్ కుమార్ లాంటి నాయకులను విచారించాలని కోరారు. బీసీసీఐ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ హెచ్‌సీఏ పలు నిర్ణయాలు తీసుకుందని కూడా ఆరోపించారు. గతంలోనూ ఈ అంశంపై పలు వారం సంచలన వ్యాఖ్యలు చేసిన గురువారెడ్డి, తాజాగా మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read More : భూముల ధరల పతనంపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

2 thoughts on “హెచ్‌సీఏ అక్రమాల్లో కేటీఆర్, కవితల ప్రమేయం ఉందని ఆరోపణ ?

Comments are closed.