మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచే పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు..
ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ కూడా ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. దాంతో వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీటన్నింటిపైనా వీరు స్పందించారు.
“మేము భూమి మీదకు తిరిగి వచ్చే విషయంలో అనిశ్చితి నెలకొంది.. ఇది చాలా కష్టమైన అంశం” అని అంతరిక్ష కేంద్రం నుంచి సునీత మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా తాము అంతరిక్షంలో ఉండిపోవడం వల్ల వ్యక్తమవుతోన్న ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ.. భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్ అంగీకరించారు. 2030లో అంతరిక్ష కేంద్రం (ISS) జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. అప్పటికంటేముందే ISS ను రిటైర్ చేయాలని ఇటీవల మస్క్ ప్రతిపాదించారు.
అయితే సునీత విలియమ్స్ మాట్లాడుతూ “ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం. నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను” తన అభిప్రాయం వ్యక్తంచేశారు.

One thought on “అంతరిక్ష కేంద్రం నుండి మీడియాతో మాట్లాడిన సునీతా విలియమ్స్”
Comments are closed.