భూమి గరవ్యతాకర్షణానికి అలవాటు కావడానికి సునీతా విలియమ్స్ సహా క్రూ-9 బృందానికి 45 రోజుల రిహాబిలిటేషన్

sunita williams and team

సుదీర్ఘ అంతరిక్ష యాత్ర అనంతరం భూమ్మీదకు చేరిన క్రూ-9 వ్యోమగాములు, అందులో భాగంగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ కూడా, భూమి గురుత్వాకర్షణానికి అలవాటు పడేందుకు ప్రత్యేక పునరావాస కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది.

ఈ పునరావాస కార్యక్రమాన్ని మూడు దశలుగా నిర్వహించనున్నారు. మొదటి దశలో ప్రధానంగా శరీర కదలికలు మరియు కండరాల దృఢత్వాన్ని పెంచడంపై దృష్టి సారిస్తారు. అంతరిక్ష ప్రయాణం సమయంలో శరీరంలోని మూడుపాళ్ల కంటే ఎక్కువ బరువును కోల్పోతారు. దాంతో కండరాలను తిరిగి బలపరచడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

రెండో మరియు మూడో దశల్లో బ్యాలెన్స్ మెరుగుపరిచే వ్యాయామాలు, గుండె సంబంధిత వ్యాయామాలు (కార్డియోవాస్కులర్ ట్రైనింగ్) నిర్వహిస్తారు. అంతేకాకుండా, వ్యోమగాములు పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు సాధారణ జీవనశైలికి తిరిగి చేరుకోనున్నారు.

Read More

One thought on “భూమి గరవ్యతాకర్షణానికి అలవాటు కావడానికి సునీతా విలియమ్స్ సహా క్రూ-9 బృందానికి 45 రోజుల రిహాబిలిటేషన్

Comments are closed.