రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నా అంచనా తప్పు: శశి థరూర్

shashi-tharoor_

శశి థరూర్‌ మాట్లాడుతూ, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత దేశ నిష్పాక్షిక ధోరణిపై తాను తొలుత తప్పుగా అంచనా వేసినట్లు అంగీకరించారు. భారత ప్రభుత్వం అనుసరించిన తటస్థ వైఖరి ఇప్పుడు శాశ్వత శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు సహాయపడుతోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ మిత్ర సంబంధాలు కొనసాగిస్తూ, ఇద్దరినీ ఆలింగనం చేసుకునే విధంగా భూఅరత్నంగా మారారని శశి థరూర్ వ్యాఖ్యానించారు.