ఉమెన్స్‌డే స్పెషల్ – మెగాస్టార్ చిరంజీవి నుంచి శ్రీలీలకు అదిరిపోయే గిఫ్ట్!

ఉమెన్స్‌డే స్పెషల్ - మెగాస్టార్ చిరంజీవి నుంచి శ్రీలీలకు అదిరిపోయే గిఫ్ట్!

యంగ్ బ్యూటీ శ్రీలీల మెగాస్టార్ చిరంజీవి నుంచి ఓ అద్భుతమైన బహుమతి అందుకుంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తనతో కలిసి పనిచేసిన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీలీలకు చిరు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో జరుగుతోంది. ఇదే స్టూడియోలో మరో మూవీ షూటింగ్‌లో పాల్గొన్న శ్రీలీల, చిరంజీవి కూడా అక్కడే ఉన్నారని తెలుసుకొని విశ్వంభర సెట్స్ వద్దకు వెళ్లింది.

చిరంజీవిని కలుసుకున్న శ్రీలీల, ఆయనతో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ మహిళా దినోత్సవం ప్రత్యేకంగా శ్రీలీలకు ఓ గిఫ్ట్ అందజేశారు. శాలువాతో సత్కరించి, దుర్గాదేవి రూపం ముద్రించిన శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. చిరు నుంచి వచ్చిన ఈ స్పెషల్ గిఫ్ట్‌ను అందుకున్న శ్రీలీల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరుతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన శ్రీలీల, “విత్ ది ఓజీ! మనం వెండితెరపై ఎంతో ఆదరించే శంకర్ దాదా ఎంబీబీఎస్, మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం చాలా హ్యాపీ. ఉమెన్స్ డే సందర్భంగా ఆయన స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. రుచికరమైన భోజనం కూడా ఏర్పాటు చేశారు. థాంక్యూ చిరు సార్!” అంటూ ఆనందం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు శ్రీలీల, చిరు కలయికపై భిన్నమైన రియాక్షన్లు వ్యక్తం చేస్తున్నారు. మరి, మెగాస్టార్ బహుమతిని అందుకున్న శ్రీలీల త్వరలో చిరుతో కలిసి ఓ సినిమా చేస్తుందా? అనేది చూడాలి!

Read More

One thought on “ఉమెన్స్‌డే స్పెషల్ – మెగాస్టార్ చిరంజీవి నుంచి శ్రీలీలకు అదిరిపోయే గిఫ్ట్!

Comments are closed.