ఒకప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రేమజంట షాహిద్ కపూర్ – కరీనా కపూర్ మళ్లీ ఒకే వేదికపై కలుసుకున్నారు. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు ‘జబ్ వి మెట్’ మూవీ ద్వారా భారీ హిట్ అందుకున్న ఈ జోడీ, విడిపోయిన తర్వాత చాలా ఏళ్లుగా దూరంగా ఉండిపోయారు. అయితే, తాజాగా వీరిద్దరూ ఓ ప్రత్యేక వేడుకలో ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముచ్చటగా మాట్లాడుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఐఫా (IIFA) అవార్డ్స్ 2025 ప్రీ ఈవెంట్ ప్రెస్ మీట్‌లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ వేదికను పంచుకున్నారు. స్టేజీపైకి రాగానే ఇద్దరూ హత్తుకోని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. గతంలో వీరిద్దరూ కలిసి కనబడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఈ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఈ ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు షాహిద్ కపూర్ మీడియాతో మాట్లాడుతూ, “ఇది మాకు కొత్తేమీ కాదు. మేము ఇక్కడ, అక్కడ తరచూ కలుస్తుంటాం. ఇలాంటి వేడుకల్లో కలవడం సహజమే. ప్రజలు మా రీయూనియన్ చూసి సంతోషపడతే, మేము కూడా సంతోషిస్తాం” అని అన్నారు.
కరీనా కపూర్ బ్రేకప్ తర్వాత సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకొని, తన కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు, షాహిద్ కపూర్ మీరా రాజ్‌పుత్‌ను వివాహం చేసుకుని పిల్లలతో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. కానీ, విడిపోయినప్పటికీ వారి మధ్య స్నేహబంధం మాత్రం కొనసాగుతూనే ఉంది.
అభిమానులు “మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తారా?” అనే చర్చను మొదలుపెట్టారు. మరి, భవిష్యత్తులో ఈ మాజీ జంట కలిసి పనిచేస్తారేమో చూడాలి!

One thought on “ఒకే వేదికపై షాహిద్ – కరీనా.. అభిమానులను ఆశ్చర్యపరిచిన రీయూనియన్!”
Comments are closed.