హనీమూన్ యాత్రలో భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ ప్రస్తుతం మేఘాలయ పోలీసుల అదుపులో ఉంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
గత రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూర్ నుంచి రోడ్డు మార్గంలో బక్సర్ మీదుగా బయలుదేరిన మేఘాలయ పోలీసుల బృందం సోనమ్‌తో కలిసి పాట్నాకు చేరుకుంది. ప్రస్తుతం ఆమెను పాట్నా నగరంలోని ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గువాహటి విచారణకు తరలించే ప్రక్రియను మేఘాలయ పోలీసులు ప్రారంభించారు.
నేటి మధ్యాహ్నం 12:40 గంటలకు పాట్నా విమానాశ్రయం నుంచి సోనమ్‌ను గువాహటికి తరలించనున్నారు. ఉదయం 11 గంటల లోపే ఆమెను విమానాశ్రయానికి తీసుకెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారణ జరపనున్నారు. ఇందుకోసం మేఘాలయ పోలీసులు ఇప్పటికే ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను పొందారు.
మే 23న రాజా, సోనమ్ దంపతులు హనీమూన్‌కు బయలుదేరిన అనంతరం అదృశ్యమయ్యారు. జూన్ 2న మేఘాలయలోని వైసాడాంగ్ పార్కింగ్ లాట్ సమీపంలో ఓ లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. అప్పటి నుంచి తప్పించుకున్న సోనమ్, జూన్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు లొంగిపోయింది.
తనను మత్తుమందు ఇచ్చి తీసుకువచ్చారని సోనమ్ చెప్పినట్లు సమాచారం. ఆమె లొంగిపోవడం మేఘాలయ పోలీసులు అనుమానిస్తున్న కుట్రకు చక్కటి ఆధారంగా మారింది. ఈ కేసులో సోనమ్‌తో పాటు, ఆమె ప్రియుడు రాజ్ సింగ్ కుష్వాహా, విశాల్ సింగ్ చౌహాన్ (ఇండోర్), ఆకాశ్ రాజ్‌పుత్ (లలిత్‌పూర్), ఆనంద్ (సాగర్ జిల్లా బినా)లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగిందని మేఘాలయ పోలీసులు భావిస్తున్నారు. సోనమ్‌కు మద్దతుగా పని చేసిన వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే హత్య కేసు మరిన్ని మలుపులు తిరగనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : బీహార్‌లో ఏడాది పాటు నకిలీ పోలీస్ స్టేషన్…

One thought on “హనీమూన్ హత్య కేసులో సోనమ్ గువాహటికి తరలింపు.”
Comments are closed.