ఘజియాబాద్‌లో డెలివరీ వేషంలో నగల దుకాణం దోపిడి

ఘజియాబాద్‌లో అతి ధైర్యంగా దొంగతనం చేసిన ఇద్దరు యువకులు ఫుడ్ డెలివరీ యాప్ యూనిఫాం వేసుకుని నగల దుకాణాన్ని ఖాళీ చేశారు. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో స్విగ్గీ, బ్లింకిట్ యూనిఫాంలలో హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు నగల దుకాణంలోకి చొరబడ్డారు. లోపలికి చేరుకున్న వెంటనే అక్కడున్న సేల్స్‌మెన్‌పై దాడి చేసి, బంగారు, వెండి ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగుల్లో వేసుకున్నారు. కుర్చీతో అద్దాలను పగలగొట్టి మరీ నగలు సేకరించారు.

దాదాపు ఐదు నిమిషాల్లోనే 20 కిలోల వెండి, 125 గ్రాముల బంగారం తీసుకుని బైక్‌పై పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 15 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం ఘటన దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డవగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More : రామేశ్వరం కేఫ్‌లో ఫేక్ వీడియోతో రూ.25 లక్షలు డిమాండ్