సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా?: సీఎం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, నిర్దాక్షిణ్యమైన ప్రవర్తనలపై తీవ్రంగా స్పందించారు. “తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, కానీ చేసిన పనులు శాశ్వతం” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కారు కింద పడిన సమయంలో అతన్ని ఆసుపత్రికి కూడా తీసుకెళ్లే బాధ్యత లేకుండా ప్రవర్తించడాన్ని ఆయన ఖండించారు. “కంప చెట్లలో పడేసి వెళ్లారు అంటే, మానవత్వం ఉందా?” అంటూ ప్రశ్నించారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నించడాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.

గత ప్రభుత్వం పాలనపై మండిపడ్డ ఆయన, “అర్హత లేని వారికి పథకాలు ఇచ్చారు. ఏడాదికి రూ. 250 పెన్షన్ పెంచి గొప్పగా చెప్పుకుంటున్నారు” అన్నారు. తల్లికి వందనం పథకంలో ఒక్క బిడ్డకే మంజూరు చేసిన వారికి వ్యతిరేకంగా, “మన ప్రభుత్వం అందరికీ ఇచ్చింది” అంటూ వివరించారు.

Read More : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

One thought on “సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా?: సీఎం

Comments are closed.