పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చారిత్రక చిత్రం ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదలై అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరయోధుడిగా పవన్ కల్యాణ్ శక్తివంతంగా కనిపించారు.ఈ సంఘటనలో బంధువులను కోల్పోయి, తమ ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్న వారి కుటుంబ సభ్యులు గురువారం పరిశ్రమ గేటు వద్ద నిరసన తెలిపారు. “ఆంధీ వచ్చేసింది”, “అందరూ నేను రావాలని దేవుడిని ప్రార్థిస్తారు.. కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు” అనే సంభాషణలు అభిమానులకు గూస్‌బంప్స్ తెచ్చేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో పవన్, మొఘలులను ఢీకొంటూ సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ క్రూరమైన చక్రవర్తి ఔరంగజేబుగా భయాందోళన కలిగించే పాత్రలో కనిపిస్తారు. పవన్, బాబీ మధ్య వచ్చే దృశ్యాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
క్రిష్ దర్శకత్వంలో జ్యోతి కృష్ణ కథను సమర్పించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందించారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

One thought on “పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల”
Comments are closed.