పల్నాడు జిల్లా కనమర్లపూడి వద్ద రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాన్ని తీసుకుంది. ప్రైవేటు బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులు గాయపడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ఘటన రహదారిపై తీవ్ర కలకలం రేపింది.
Read More : వంశీ విడుదలతో రాజకీయ వేడి..

One thought on “పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం”
Comments are closed.