పాశమైలారం పేలుడు ఘటనపై సిగాచీ ప్రకటన

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ఘోర ప్రమాదంపై సిగాచీ పరిశ్రమ స్పందించింది. కంపెనీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ఈ ప్రమాదంలో 40 మంది కార్మికులు మృతి చెందారని వెల్లడించారు. మరో 33 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించనున్నట్టు పేర్కొంది. బాధితుల పట్ల అన్ని విధాలా సహాయంగా ఉంటామని స్పష్టం చేసింది.

సిగాచీ సంస్థ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఈ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంపై స్టాక్‌మార్కెట్లకు ఆయన లేఖ కూడా రాశారు. ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని వెల్లడించారు. నిజమైన కారణాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారిక నివేదిక కోసం వేచిచూస్తున్నామని తెలిపారు.

Read More : రద్దీ సమయంలో సర్జ్ ఛార్జీలకు కేంద్రం అనుమతి

One thought on “పాశమైలారం పేలుడు ఘటనపై సిగాచీ ప్రకటన

Comments are closed.