మృతుల మాంసపు ముద్దలను బాక్సుల్లో అప్పగించిన విషాద ఘటన

సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రాంతంలో ఉన్న సిగాచి పరిశ్రమలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తించలేని స్థితికి చేరాయి. దీంతో గుర్తించగలిగిన శవ అవశాలను చిన్న చిన్న మాంసపు ముద్దలుగా ప్యాక్ చేసి ప్రత్యేక బాక్సుల్లో తగిన విధంగా పెట్టి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించడం హృదయ విదారక దృశ్యంగా మారింది. తమ బిడ్డల శవాల స్థానంలో ఇలా మాంసపు ముద్దలే అందించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

ఈ ఘటన కేవలం పరిశ్రమలో నిబంధనల పరిరక్షణలో విఫలమైన తీరునే కాక, ప్రమాదానంతర పరిస్థితుల నిర్వహణలోని విచారకర పరిస్థితులను బయటపెట్టింది. ప్రభుత్వంపై, పరిశ్రమ యాజమాన్యంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Read More : మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

One thought on “మృతుల మాంసపు ముద్దలను బాక్సుల్లో అప్పగించిన విషాద ఘటన

Comments are closed.