హైదరాబాద్ శివారులోని చందానగర్‌లో దొంగలు అల్లకల్లోలం సృష్టించారు. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జువెలర్స్’లో దోపిడీకి యత్నించిన దుండగులు, అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా, దొంగలు పరారయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సాక్షుల ప్రకారం, ఆరుగురు దుండగుల ముఠా మొదట దుకాణం గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై దాడి చేసి లోపలకు చొరబడ్డారు. అనంతరం షాపులో ఎదురు తిరిగిన అసిస్టెంట్ మేనేజర్ సతీశ్‌పై కాల్పులు జరిపి, ఆయన కాలులో బుల్లెట్ దూసుకెళ్లేలా చేశారు. లాకర్ కీలు ఇవ్వమని ఒత్తిడి చేసినా, ఆయన నిరాకరించడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
దొంగలు షాపులోని నగల స్టాల్స్‌ను ధ్వంసం చేసి, ఎక్కువగా వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. అలాగే, తుపాకీతో సీసీ కెమెరాలను కూడా పగులగొట్టారు. ఘటన తర్వాత జహీరాబాద్ వైపు పారిపోయిన దుండగులను పట్టుకునేందుకు జిల్లా సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనతో చందానగర్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
Read More : మునుగోడు అభివృద్ధిపై రాజ్ గోపాల్ రెడ్డి ఫైర్

One thought on “చందానగర్ ఖజానా జువెలర్స్ లో దొంగల దాడి – కాల్పులు, గాయాలు”
Comments are closed.