కూతురు ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా తండ్రి దారుణ నిర్ణయం

father-performs-ritual

మధ్యప్రదేశ్‌లోని ఖన్రోడ్ ప్రాంతంలో ఓ తండ్రి తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉజ్జయినికి చెందిన ఓ యువతి తన ప్రియుడిని ప్రేమించి పెద్దల అభిప్రాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంది. దీంతో కూతురు బతికుండగానే ఆ తండ్రి ఊరంతా పిలిచి ఆమెకు అంత్యక్రియలు నిర్వహించి, పిండం పెట్టాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తన కూతురు చనిపోయినట్లు ఊరంతా పోస్టర్లు అంటించి, పెద్దఎత్తున ప్రచారం చేశాడు. అంతేకాదు, కుటుంబ సభ్యులంతా గుండు చేయించుకుని ఊరంతా శాంతి విందు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ఆ తండ్రి, “తల్లిదండ్రుల ప్రేమను, సమాజం, కుటుంబ గౌరవాన్ని పట్టించుకోకుండా పిల్లలు తమ ఇష్టానుసారం వివాహాలు చేసుకోవడం నేటి కాలంలో ట్రెండ్‌గా మారింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Read More

One thought on “కూతురు ప్రేమ వివాహానికి వ్యతిరేకంగా తండ్రి దారుణ నిర్ణయం

Comments are closed.