ప్రభాస్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ – నాగ్ అశ్విన్ స్పష్టం

Nag Ashwin Confirms More Screen Time for Prabhas in Kalki 2898 AD Part 2

ప్రస్తుతం ప్రభాస్ తన తదుపరి చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అతని చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ‘కల్కి 2898 ఏ.డి’ రెండో భాగం షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నంగా ఉండగా, వచ్చే రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ సినిమా రెండో భాగం పూర్తిగా ప్రభాస్ పాత్ర చుట్టూ తిరుగుతుందని స్పష్టం చేశారు.

మొదటి భాగంలో ప్రభాస్‌కు తక్కువ స్క్రీన్ టైమ్ ఉండటంపై ప్రశ్నలు రాగా, రెండో భాగంలో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని దర్శకుడు పేర్కొన్నారు.

“రెండో భాగంలో ప్రభాస్‌ను ఎక్కువసేపు చూపించబోతున్నాం. ఈసారి ఆయన పాత్రకు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుంది. మొదటి భాగం కథా నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేయడానికి మాత్రమే. ఇక రెండో భాగంలో అసలు కథ ముందుకు సాగుతుంది. ఇందులో కర్ణ, భైరవ కోణాన్ని ప్రధానంగా చూపించబోతున్నాం,” అని నాగ్ అశ్విన్ వివరించారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read More

One thought on “ప్రభాస్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ – నాగ్ అశ్విన్ స్పష్టం

Comments are closed.