పెళ్లి తర్వాత వరుస బిజీ షెడ్యూళ్లతో దూసుకుపోతున్న కియారా అద్వాణీకి ‘డాన్ 3’ సినిమాలో తగిన షాక్ తగిలింది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయికగా మొదట కియారాను ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. అయితే, కియారాకు అనుకోని షెడ్యూల్ క్లాష్‌ల కారణంగా ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించేసినట్టు తెలుస్తోంది. ఫర్హాన్ అక్తర్, ఈ చిత్రం కోసం కొత్త కథానాయికను ఎంపిక చేసినట్టు సమాచారం.
తాజాగా కియారా స్థానంలో శార్వరీ వాఘ్‌కి అవకాశం దక్కినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘ముంజ్యా’ వంటి హిట్ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈ నటి, ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదిస్తోంది. మహారాజ్, వేదా, ఆల్ఫా లాంటి ప్రాజెక్టులు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉండగా, ‘డాన్ 3’తో మరింత హైప్‌ను దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
డాన్ 3 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షారూఖ్ ఖాన్ స్థానంలో రణ్‌వీర్ సింగ్ ఎంపిక కావడమే పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు శార్వరీ వాఘ్ కియారా స్థానాన్ని దక్కించుకోవడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 2025 చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాపై ఫర్హాన్ అక్తర్ గట్టిగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. కథ, పాత్రలు మరింత పటిష్టంగా ఉండేందుకు ఆయా మార్పులు చేస్తూ చిత్రాన్ని మలుస్తున్నారు.

One thought on “డాన్ 3లో కొత్త ట్విస్ట్ – కియారా ఔట్, శార్వరీ ఇన్!”
Comments are closed.