పాలక్‌తో డేటింగ్ రూమర్స్‌పై నిజం చెప్పిన ఇబ్రహీం

Ibrahim Ali Khan Palak Tiwari relationship

బాలీవుడ్ యంగ్ హీరో ఇబ్రహీం అలీఖాన్ తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఇబ్రహీం ‘నాదానియన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ చిత్రం విమర్శకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమా విడుదలకు ముందే పాలక్ తివారీతో డేటింగ్ పుకార్లు ఇబ్రహీంకు మంచి ఫోకస్ తెచ్చాయి.

ఇబ్రహీం, పాలక్ తివారీ కలిసి తరచూ ఫోటోలు తీయించుకోవడం, మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారనే వార్తలు, వీరి రిలేషన్‌షిప్ రూమర్లకు బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇబ్రహీం ఈ అంశంపై స్పందించాడు. పాలక్‌ తనకు మంచి స్నేహితురాలని, ఆమె చాలా స్వీట్‌గా ఉంటుందని తెలిపాడు. అంతకుమించి తమ మధ్య ఏమీలేదని స్పష్టం చేశాడు.

ఇబ్రహీం ప్రస్తుతం ‘సర్జమీన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు కూడా ఉన్నారు. సినిమా షూటింగ్ పూర్తైనప్పటికీ విడుదల తేదీ ప్రకటించలేదు. ‘నాదానియన్’లో ఇమేజ్ బిల్డ్ చేయలేకపోయిన ఇబ్రహీం, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో తన అవకాశాలను మెరుగుపరచాలని చూస్తున్నాడు.

పాలక్ తివారీగా చూస్తే, ఆమె ‘ది భూత్నీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉన్నా, చివరకు మే 1, 2025కి వాయిదా పడింది. ఇబ్రహీం-పాలక్ ల మధ్య నిజంగా కేవలం స్నేహమేనా లేక మరేదైనా ఉందా అన్నది అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read More


One thought on “పాలక్‌తో డేటింగ్ రూమర్స్‌పై నిజం చెప్పిన ఇబ్రహీం

Comments are closed.