ఎన్టీఆర్ లుక్ ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జెప్టో యాడ్‌లో వచ్చిన స్టైల్ అభిమానులకు అంతగా నచ్చకపోవడంతో, ముఖ్యంగా ఆయన హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్‌పై ట్రోలింగ్ జరిగింది. అయితే, యాడ్ కోసం మాత్రమే ఈ లుక్ మార్చుకున్నారా? లేక ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసమా? అనే ప్రశ్నలకు అభిమానులు క్లారిటీ కోసం ఎదురుచూశారు.
ఇదే క్రమంలో తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. స్టైలిష్ సన్‌గ్లాసెస్, క్యాజువల్ అవుట్‌ఫిట్‌తో ఎన్టీఆర్ ట్రెండీ లుక్‌లో అదరగొట్టాడు. యాడ్‌లో లుక్ బాగా లేదని కామెంట్స్ చేసిన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ స్టైల్‌కి ఫిదా అయ్యారు.
ఎన్టీఆర్ తాజా లుక్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయబోయే ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్, ఎన్టీఆర్ కెరీర్లో కీలకంగా మారనుంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.
టాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్లను కలిపి తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కమర్షియల్ యాడ్స్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొందుతున్నాయి.

One thought on “ఎన్టీఆర్ లుక్‌పై ట్రోల్స్.. ఎయిర్పోర్ట్ స్టైల్‌తో ఫ్యాన్స్ ఫిదా!”
Comments are closed.