సెమీకండక్టర్ కేటాయింపులో కేంద్రంపై మంత్రి విమర్శలు

సెమీకండక్టర్ ప్రాజెక్టు కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అన్యాయం చేసిందని రాష్ట్ర పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టడం అవమానకరమని ఆయన అన్నారు.

తెలంగాణకు అనుకూలంగా ఉండాల్సిన ప్రాజెక్టును రాజకీయ కోణంలో వేరే రాష్ట్రానికి మళ్లించడాన్ని మంత్రి ఖండించారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఇలాంటి నిర్ణయాలు ప్రతికూల సంకేతాలు ఇస్తాయని హెచ్చరించారు.

సెమీకండక్టర్ ప్రాజెక్ట్ కోసం ప్రైమ్ లొకేషన్‌లో 10 ఎకరాలు కేటాయించినా కేంద్రం పట్టించుకోలేదని, కానీ ఏపీ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా ఇవ్వకపోయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు.

కేంద్రం విధానాలను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Read More : కాళేశ్వరం జలాశయాలు నింపాలని హరీశ్ రావు డిమాండ్