తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ జలాశయాలను వెంటనే నింపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతుల కోసం ఆరో ప్యాకేజీ వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేయాలని కోరారు. జలాశయాల్లో నీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ పర్యటనలో హరీశ్ రావు ఎరువుల కోసం క్యూలో నిలబడి ఉన్న రైతులను చూసి ఆగారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటీపీ, ఒక బస్తా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్నికల దృష్ట్యా ఎరువులను బీహార్‌కు తరలిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Read More : స్వాతంత్ర్య దినోత్సవానికి గోల్కొండలో భారీ ఏర్పాట్లు

2 thoughts on “కాళేశ్వరం జలాశయాలు నింపాలని హరీశ్ రావు డిమాండ్”
Comments are closed.