సికింద్రాబాద్‌లో స్పెర్మ్ క్లినిక్ దందా బహిర్గతం

సికింద్రాబాద్‌లోని ఓ స్పెర్మ్ క్లినిక్‌లో సంచలన దందా బయటపడింది. పోలీసులు చేసిన దర్యాప్తులో బిచ్చగాళ్లు, అడ్డకూలీల నుంచి వీర్యం, అండాలను సేకరించి పిల్లలు లేని వారికి సంతానం కల్పించే పేరుతో వికృత కార్యకలాపాలు జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, “ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్” పేరుతో నడుస్తున్న ఈ క్లినిక్‌లో డాక్టర్ నమ్రతతో పాటు ఏడుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో బిచ్చగాళ్లకు బిర్యానీ, అడ్డకూలీలకు మద్యం, చదువుకున్న వారికి రూ.1,000 నుంచి రూ.4,000 వరకు చెల్లించి వీర్యాన్ని సేకరిస్తున్నట్లు, మహిళలకు అయితే ఒక్కసారి అండాల సేకరణకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లిస్తున్నట్లు తేలింది.

నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నవారి నుంచి, పూర్తి వైద్యపరీక్షల తర్వాత మాత్రమే వీర్యం సేకరించాలి. ఒక దాత నుంచి 25 సార్లు మాత్రమే వీర్యం సేకరించవచ్చు. కానీ ఈ క్లినిక్‌లో వారానికోసారి ఒకే వ్యక్తి నుంచి వీర్యం సేకరిస్తున్నట్లు గుర్తించారు.

తమకు తెలిసిన మహిళలను తీసుకొస్తే అదనపు చెల్లింపులు ఇస్తామంటూ ప్రలోభపెట్టడం, వైద్యపరమైన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Read More : బీసీ బిల్లుపై 72 గంటల దీక్షకు సిద్ధమైన కవిత

One thought on “సికింద్రాబాద్‌లో స్పెర్మ్ క్లినిక్ దందా బహిర్గతం

Comments are closed.