NCLTలో జగన్‌కు ఊరటా?

వైఎస్ జగన్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి పెద్ద ఊరట లభించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదిలీపై కొనసాగుతున్న వివాదంలో ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది.

సీబీఐ, ఈడీ దర్యాప్తులు కొనసాగుతున్న నేపధ్యంలో ప్రస్తుతం షేర్ల బదిలీ సాధ్యం కాదని NCLT స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్ 2024 సెప్టెంబరులో పిటిషన్ దాఖలు చేయగా, సుమారు 10 నెలల పాటు రెండు వైపుల వాదనలు విన్న ట్రిబ్యునల్ జగన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ నిర్ణయంతో షేర్ల బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయబడింది. జగన్ న్యాయపరమైన పోరాటానికి ఇది ఒక ముఖ్య విజయంగా భావిస్తున్నారు.

Read More : ప్రిన్సిపాల్ దారుణం – విద్యార్థిని గర్భవతిగా?