సంయుక్త మీనన్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్

తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో ‘గోల్డెన్ బ్యూటీ’గా పేరు సంపాదించిన నటి సంయుక్త మీనన్, ఇటీవల చేసిన వ్యాఖ్యలతో హాట్‌టాపిక్‌గా మారారు. తాను మద్యం సేవించే అలవాటు ఉందని బహిరంగంగానే చెప్పిన ఆమె, ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అయితే, తాను ప్రతిరోజూ మద్యం సేవించనని, కేవలం తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా తీసుకుంటానని సంయుక్త స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత కోసం అప్పుడప్పుడు ఇలాచేస్తానని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంయుక్త, తర్వాత ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి నటించే ‘అఖండ 2’ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే ‘స్వయంభు’, ‘నారి నారి నడుమ మురారి’, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం, విజయ్ సేతుపతి సినిమా వంటి పలు ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం ఇవి షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

Read More : ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

One thought on “సంయుక్త మీనన్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్

Comments are closed.