తెలుగు నటి మన్నారా చోప్రా ముంబై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఘటన చర్చనీయాంశమైంది. జైపూర్ వెళ్లాల్సిన తన ఫ్లైట్‌కు అనుమతి నిరాకరించారని ఆమె ఆరోపించింది. తాను సమయానికి వచ్చిందని, అయినా తన పేరును ప్రకటించలేదని విమానాశ్రయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేయగా, నెటిజనుల నుంచి మన్నారాకు మద్దతు లభించలేదు.
తాను బోర్డింగ్ గేట్ దగ్గర కూర్చున్నప్పటికీ, ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనను విమానం ఎక్కనివ్వలేదని మన్నారా వాదించింది. తనను తక్కువగా అర్థం చేసుకున్నారని, ఎయిర్‌లైన్ ప్రతినిధులు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించింది.
విమానం షెడ్యూల్ టైమ్‌కు 15 నిమిషాల ముందే బయలుదేరిందని చెప్పిన మన్నారా, ఇదే సంస్థతో ఢిల్లీ విమానాశ్రయంలోనూ ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నానని వెల్లడించింది.
ఈ వ్యవహారంపై నెటిజనులు తీవ్రంగా స్పందించారు. మన్నారా సెలబ్రిటీ అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఆమె పేరు ప్రకటించాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విమానాశ్రయ సిబ్బంది స్పందించాల్సి ఉంది. కెరీర్ విషయానికి వస్తే, మన్నారా ప్రస్తుతం లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 2లో పోటీదారుగా పాల్గొంటుంది. అలాగే, బిగ్ బాస్ 17 (హిందీ)లో తన ప్రదర్శన తర్వాత డాన్స్ దీవానే 4లోనూ మెరిసింది.

One thought on “విమానాశ్రయంలో తెలుగు నటి మన్నారా చోప్రా హంగామా!”
Comments are closed.