బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన కత్తి దాడి అనంతరం అతడు తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలోని అతడి నివాసంలో దొంగలు చేసిన దాడిలో సైఫ్ వెన్నుకుక్కకు తీవ్ర గాయం అయింది. శస్త్రచికిత్స అనంతరం సైఫ్ త్వరగా కోలుకోవడంలో వైద్యుల పాత్ర ముఖ్యమైనది.
ఈ నేపథ్యంలో సైఫ్ ఖతార్‌లో విలాసవంతమైన ఆస్తిని కొనుగోలు చేశాడు. ‘ది సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ఐలాండ్’లోని ‘ది రెసిడెన్సెస్’లో అతడు అపార్ట్‌మెంట్ తీసుకున్నాడు. ఖతార్‌లోని ‘ది పెర్ల్’ ప్రాంతం సంపన్నుల నివాస ప్రాంతంగా పేరొందింది. కుటుంబంతో సురక్షితంగా విరామ సమయం గడిపేందుకు ఇది ఉత్తమమని సైఫ్ భావిస్తున్నట్టు సమాచారం.
సైఫ్ ఇప్పటికే పటౌడి ప్యాలెస్‌లో నివసించడమే కాకుండా, ముంబై బాంద్రాలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజా కొనుగోలు ఆయన జీవితంలో మరో కీలకమైన పెట్టుబడిగా భావించబడుతోంది. సైఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సురక్షితమే తన నిర్ణయానికి దారితీసిందని తెలిపాడు.
ఇదిలా ఉంటే, సైఫ్ నటించిన తాజా చిత్రం ‘జ్యువెల్ థీఫ్: ది హీస్ట్ బిగిన్స్’ ఈ నెల 25న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. కూకీ గులాటి, రాబీ గ్రెవాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్ప్లిక్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు.

One thought on “కత్తి దాడి అనంతరం… సైఫ్ ఖతార్‌కు షిఫ్ట్!”
Comments are closed.