నిహారిక కొణిదెల తాజాగా విడుదల చేసిన స్పెషల్ డ్యాన్స్ వీడియో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. తన అందం, అభినయంతో ప్రత్యేకమైన ముద్ర వేసిన ఆమె, బాపు చిత్రాల్లో కనిపించే సౌందర్యం, భన్సాలీ సినిమాల కళాత్మకతను తలపించింది.
ఒక్క చూపుతోనే భావప్రకటన చేసే భానుప్రియ, శ్రీదేవి, జయప్రదల మాదిరిగా నిహారిక కూడా తన అభినయాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది.
తాజా వీడియోలో నృత్య విన్యాసాలు, భావప్రకటన, మేకోవర్ అన్నీ ఎంతో ఆకట్టుకున్నాయి. అంబటి భార్గవి, యోగ్ కిషన్ కలిసి ఈ డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా పని చేశారని నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నిహారిక తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ నిర్మాతగా మరో సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
‘కమిటీ కుర్రోళ్లు’ విజయంతో హిట్ ప్రొడ్యూసర్‌గా మారిన నిహారిక, ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌లో రెండో సినిమాను ప్రకటించింది. మానస శర్మ దర్శకత్వం వహించే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. వెబ్ సిరీస్‌లతో తన ప్రతిభను నిరూపించుకున్న మానస శర్మ, నిహారిక నిర్మాణంలో ఏవిధమైన మ్యాజిక్ చేయనున్నదో చూడాలి.

2 thoughts on “బాపు బొమ్మలా నిహారిక.. భన్సాలీ స్టైల్‌లో”
Comments are closed.