తెలంగాణ రైతులకు మరో విడత రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో విడత నిధులను విడుదల చేసింది. తాజాగా రూ.1189.43 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, గురువారం నాడు 4,43,167 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేసింది.

ఇప్పటివరకు మొత్తం 62.47 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులుగా రూ.6404.7 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. భూమి పరంగా చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా 106 లక్షల ఎకరాల పంట భూమికి సాయాన్ని అందించినట్టు ప్రభుత్వం తెలిపింది.

రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ పంట సాగుకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశమని అధికారులు వివరించారు. రైతులు సకాలంలో సాగు పనులు ప్రారంభించేందుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Read More : బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు వద్దని కేంద్రానికి ఉత్తమ్ వినతి