కుబేరా సినిమా టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నటుడు ధనుష్, కింగ్ నాగార్జున నటించిన “కుబేర” సినిమా టిక్కెట్ల ధరలను 10 రోజుల పాటు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర రూ.236కు చేరుకోనుండగా, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర రూ.265గా నిర్ణయించబడింది.

ఈ నిర్ణయం చిత్ర నిర్మాణ సంస్థకు ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా ఉంటుందని భావిస్తున్నారు. “కుబేరా” సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, తొలి 10 రోజులూ టికెట్ ధరలను పెంచేందుకు నిర్మాతలు ప్రభుత్వం వద్ద వినతి చేశారు. దీనిపై పర్యవేక్షన తర్వాత ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

ఈ పెంపు నిర్ణయం ఈ నెలలో విడుదల కానున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచనుంది. అయితే, టికెట్ ధరల పెంపుతో సాధారణ ప్రేక్షకులపై భారం పడే అవకాశముందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. టికెట్ ధరల పెంపు కేవలం 10 రోజులకే పరిమితమై ఉండటంతో, ఆ తర్వాత మళ్లీ సాధారణ ధరలకే అమ్మకాలు జరగనున్నాయి.

Read More : దక్షిణాది సినిమాలపై జెనీలియా ప్రశంసలు

One thought on “కుబేరా సినిమా టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వ..?

Comments are closed.