ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) నోటీసులు జారీ చేసింది. జూలై 14న ఇచ్చిన ఈ నోటీసుల్లో, రెండు రోజుల లోపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య తమ కార్యాలయానికి హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సూచించింది.

అయితే ఇప్పటికీ ప్రవీణ్ కుమార్ దీనిపై స్పందించలేదు. వాంగ్మూలం ఇవ్వడాన్ని ఆయన నిరాకరించినట్లు సమాచారం. ముఖ్యంగా, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని భావించి ఆయన మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్‌ను హ్యాక్ చేసిందని, ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆయన కేంద్ర ఎన్నికల సంఘం మరియు డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Read More : జయశంకర్ విగ్రహ గద్దె కూల్చివేతపై కవిత ఆగ్రహం