గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్‌లో ఉన్న ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు బైపాస్ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. జగన్ ఈ రోజు తాడేపల్లి నుంచి భారీ కాన్వాయ్‌తో సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు పర్యటనకు బయలుదేరారు. పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ సమయంలో రోడ్డుపై నడుస్తున్న ఓ వృద్ధుడు కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, సిబ్బంది అతన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టిన అనంతరం ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read More : ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు రైతులు ఆత్మహత్య

One thought on “గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రమాదం

Comments are closed.