రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ, ఇరిగేషన్ శాఖ అధికారులు కీలక చర్యకు పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ గద్దెను ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్నారంటూ, జేసీబీ సాయంతో గద్దెను కూల్చివేశారు. ఇది స్థానికంగా వివాదానికి దారి తీసింది.
ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ స్థాపనకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ మహనీయులను గౌరవించని విధంగా పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి విగ్రహ స్థాపనకు అనుమతి ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Read More : రేవంత్ రెడ్డి అలా చెప్పడం సరికాదు – ఎమ్మెల్యే

2 thoughts on “జయశంకర్ విగ్రహ గద్దె కూల్చివేతపై కవిత ఆగ్రహం”
Comments are closed.