తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) ప్రమాణం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన సీజేకు శుభాకాంక్షలు తెలిపారు.
జస్టిస్ ఏకే సింగ్ గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలందించారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వుల ప్రకారం దేశంలోని ఐదు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయగా, తెలంగాణ హైకోర్టు సీజేగా ఏకే సింగ్ నియమితులయ్యారు.
జస్టిస్ ఏకే సింగ్ ప్రొఫైల్:
జస్టిస్ ఏకే సింగ్ 1965 జూలై 7న పుట్టారు. ఆయన తాతలు జస్టిస్ బీపి సిన్హా (సుప్రీంకోర్టు ఆరో ప్రధాన న్యాయమూర్తి) మరియు జస్టిస్ శంభుప్రసాద్ సింగ్ (పట్నా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్) లు న్యాయరంగంలో ప్రసిద్ధులు. జస్టిస్ ఏకే సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ హానర్స్, న్యాయశాస్త్రంలో డిగ్రీ సాధించారు.
1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం జార్ఖండ్ హైకోర్టులో అనేక కీలక కేసులు వాదించారు. 2012లో జడ్జిగా, 2014లో శాశ్వత న్యాయమూర్తిగా, 2022లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా, 2023లో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. తాజాగా తెలంగాణకు బదిలీపై వచ్చారు.
Read More : రేవంత్ రెడ్డి అలా చెప్పడం సరికాదు – ఎమ్మెల్యే
