వైసీపీ మాజీ మంత్రి రోజా విమర్శల మోత..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఆర్.కె. రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెడితే… “వంద రెట్లు వడ్డీతో తిరిగిస్తాం” అంటూ ఆమె హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసహనానికి దారితీశాయి. ప్రజాప్రతినిధిగా ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన స్థానంలో ఉన్నప్పటికీ, రోజు తగిన భాష ప్రయోగించకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు.

టీడీపీ నాయకులు రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె హయాంలో అభివృద్ధి శూన్యమని, ఆమె నోటి దురుసే ప్రజల్లో అసహనానికి కారణమవుతోందని తెలిపారు. అంతేకాక, రోజా ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తూ… త్వరలో ఆమె అరెస్ట్ కూడా కావొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read More : కూటమి ప్రభుత్వ ప్రయత్నాలకు ఫలితం