లిక్కర్ స్కాం కేసులో ఏసీబీ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న తుడా మాజీ చైర్మన్, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి, తమ్ముడు మద్యం కారణంగా మృతి చెందారని, అదే కారణంగా తాను ఎప్పుడూ మద్యం వ్యాపారం వైపు పోకూడదని తండ్రి సూచించినట్లు న్యాయమూర్తికి తెలిపారు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానంటూ కోర్టులో ఎమోషనల్ అయ్యారు. ఇక మరోవైపు, తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి కోర్టును కోరారు.
అయితే చెవిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ హయాంలో తుడా సంస్థ ద్వారా దాదాపు రూ. 380 కోట్లు ఇష్టానుసారంగా ఖర్చు చేసినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి 4300 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అందులో 90 శాతం నిధులను చంద్రగిరి నియోజకవర్గంలోనే వాడినట్లు, వీటిలో చెవిరెడ్డికి వ్యక్తిగత ప్రయోజనాలూ ఉన్నాయని అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి ప్రతి ఖర్చుపై లెక్క చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది.
Read More : వైసీపీ మాజీ మంత్రి రోజా విమర్శల మోత..

One thought on “తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి కోర్టులో భావోద్వేగం”
Comments are closed.