సంగారెడ్డి జిల్లా తూప్రాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ గజ్జల బాబు (30) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫ్రీ బస్సు స్కీమ్ కారణంగా గిరాకీ పూర్తిగా తగ్గిపోవడంతో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనోవేదనకు గురైన బాబు, తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట తన ఆటోలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి దిగాడు.
అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ బాబు వాడపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటూ భార్య, ఇద్దరు చిన్నారులతో జీవనం సాగిస్తున్నాడు.
రాష్ట్రంలో ఫ్రీ బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో వృత్తి ఆధారంగా జీవించే చాలా మందికి జీవనాధారం దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
Read More : హైదరాబాద్‌లో ఎండ తర్వాత వర్షం: ట్రాఫిక్ జామ్‌లు..

One thought on “ఆర్ధిక ఇబ్బందులతో ఆటోలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం!”
Comments are closed.