కోల్కతాలో ఇప్పుడిప్పుడే తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రేపటికి (మార్చి 22) కోల్కతా మరియు పరిసర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షపాతం అవకాశం ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐపీఎల్ మ్యాచ్లకు ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. వర్షం ప్రభావంతో ఎడతెరిపిలేని జల్లులు కురిసే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోల్కతాలో తేలికపాటి వర్షం.. రేపటికి ఆరెంజ్ అలర్ట్ జారీ.. ఐపీఎల్ మ్యాచ్లకు ఆటంకమా?
Share This
