పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం..

pak cricket

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆర్థికంగా భారీ నష్టాలను చవిచూసింది. 29 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్‌లో జరిగిన తొలి ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) నిర్వహణలో PCBకు భారీ నష్టం జరిగింది.

ఈ టోర్నమెంట్ కోసం PCB దాదాపు రూ. 869 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చుల్లో స్టేడియం పునరుద్ధరణ, భద్రత ఏర్పాట్లు, ఇతర సదుపాయాల కల్పన వంటి విషయాలు ఉన్నాయి. అయితే, టికెట్ల విక్రయం, హోస్టింగ్ ఫీజుల రూపంలో PCBకి కేవలం రూ. 52 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది.

దీంతో పాక్ క్రికెట్ బోర్డుకు ఏకంగా రూ. 739 కోట్ల మేరకు నష్టం ఏర్పడింది. ఈ ఆర్థిక లోటు కారణంగా భవిష్యత్తులో పాకిస్తాన్‌లో అంతర్జాతీయ టోర్నమెంట్లు నిర్వహించే అవకాశాలపై అనుమానాలు నెలకొన్నాయి.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థిక పరంగా దిగజారడం వల్ల బోర్డు పరువు దిగజారినట్లు మారింది. భారీ నష్టాల నేపథ్యంలో PCB భవిష్యత్తులో అంతర్జాతీయ టోర్నమెంట్లను నిర్వహించాలా వద్దా అన్న విషయాన్ని పునఃసమీక్షించేందుకు సిద్ధమవుతోంది.

ఈ భారీ ఆర్థిక లోటు కారణంగా పాకిస్తాన్‌లో ఈ తరహా టోర్నమెంట్లను నిర్వహించడం దీర్ఘకాలికంగా సాధ్యమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read More