2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌ను విజయంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అదే సందర్భంగా రోహిత్ శర్మ, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పగా, అదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఆ మరుసటి రోజే రవీంద్ర జడేజా కూడా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు.
ఈ విజయం దాదాపు ఏడాది తర్వాత ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ, టీ20 కప్ గెలిచినా గెలవకపోయినా తాను రిటైర్మెంట్ ప్రకటించేవాడినని పేర్కొన్నారు. “నేను రిటైర్మెంట్ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నాను. మనం గెలిచినా, గెలవకపోయినా నేను తప్పుకునేలా నిర్ణయించుకున్నాను. ఎందుకంటే కొత్త ఆటగాళ్లకు అవకాశాలు రావాలి. కానీ గెలిచాక మీలో ఇంకా సత్తా ఉందని తెలుస్తుంది. కాబట్టి, అలాంటి సమయంలో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడంలో ద్వంద్వం రావచ్చు” అని వివరించాడు.
Read More : విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు
One thought on “గెలవకపోయినా తప్పుకునేవాడినని వెల్లడన”
Comments are closed.