పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై దూషణలు, విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్లకు ఆయన తండ్రి ఆజం సిద్దిఖీ కౌంటర్ ఇచ్చారు. బాబర్‌పై వ్యాఖ్యలు చేయడానికి ముందు మాటలు జాగ్రత్తగా ఉపయోగించాలని హితవు పలికారు.
ఆయన మాట్లాడుతూ, “మాజీ క్రికెటర్లు బాబర్‌ను ఎలా విమర్శిస్తున్నారో చూస్తున్నా. కానీ ఒకవేళ బాబర్ కూడా మీకే సమాధానం ఇచ్చే స్థాయికి వస్తే, మీరు తట్టుకోలేరు” అంటూ హెచ్చరించారు. ఇటీవల బాబర్ ఆజమ్‌ను కొందరు మాజీ పాక్ క్రికెటర్లు ‘మోసగాడు’ అని అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన తండ్రి, ఆటగాళ్లపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సమంజసం కాదని తెలిపారు. బాబర్ తన ఆటతోనే సమాధానం చెబుతాడని, అనవసర విమర్శలకు అతడు ప్రాధాన్యం ఇవ్వకూడదని సూచించారు. పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

One thought on “బాబర్ ఆజమ్‌పై విమర్శలు ఆపాలని మాజీ క్రికెటర్లకు ఆయన తండ్రి హితవు”
Comments are closed.