వినేశ్ ఫొగట్ — కోట్ల ఆఫర్లను తిరస్కరించిన స్పష్టత!

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో మెరిసిన ప్రతిభకు గుర్తింపుగా హర్యానా ప్రభుత్వం ప్రకటించిన రూ.4 కోట్ల నగదు బహుమతిని స్వీకరించిన నేపథ్యంలో రెజ్లింగ్‌ చాంపియన్‌ వినేశ్‌ ఫొగట్‌పై విమర్శల వర్షం కురిసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ విమర్శలకు స్పష్టతనిస్తూ వినేశ్‌ ఫొగట్ తన మనసులోని మాటను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘నా సిద్ధాంతాల కోసం ఇప్పటి వరకు కోట్లాది రూపాయల విలువైన యాడ్స్‌ను నిస్సంకోచంగా తిరస్కరించాను. సాఫ్ట్ డ్రింక్స్‌ మరియు ఆన్లైన్ గేమింగ్ కంపెనీల నుంచి బంపర్ ఆఫర్లు వచ్చినా… అవి సమాజం మీద, ముఖ్యంగా యువతపై చేసే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని నేను అవన్నీ తిరస్కరించాను’’ అంటూ వివరించారు.

‘‘ఆత్మగౌరవం, సమాజ పట్ల బాధ్యత నాకెప్పుడూ ఎంతో ప్రాముఖ్యత. ఈ విలువల కోసం నేను ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో వెనుకాడను’’ అని స్పష్టంగా పేర్కొన్నారు.

వినేశ్‌ స్పందన ఆమెపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానంగా నిలుస్తోంది.

One thought on “వినేశ్ ఫొగట్ — కోట్ల ఆఫర్లను తిరస్కరించిన స్పష్టత!

Comments are closed.