భార్య అనుష్క భావోద్వేగ స్పందన!

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు స్పందించగా, తాజాగా కోహ్లీ జీవిత భాగస్వామి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ భావోద్వేగంగా స్పందించారు. భర్త టెస్టుల నుంచి విరమణ పొందిన నేపథ్యంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హృద్యమైన సందేశాన్ని పంచుకున్నారు.

“అందరూ నీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడతారు. కానీ నువ్వు చూపిన కన్నీళ్లు, అనుభవించిన పోరాటాలు, టెస్టు క్రికెట్‌పై నీ అచంచలమైన ప్రేమ మాత్రం నాకు మాత్రమే తెలుసు. ప్రతి సిరీస్ తర్వాత నీవు మరింత వివేకవంతుడిగా, వినయంతో మళ్లీ వస్తావు. ఈ ఫార్మాట్‌లో నీవు ఎదిగిన తీరు చూస్తూ గర్వించేవాడిని.

ఒక రోజు నీవు వైట్ జెర్సీకి వీడ్కోలు చెబుతావని నాకు తెలుసు. కానీ నీవు ఎల్లప్పుడూ నీ మనసు చెప్పిందే విన్నావు. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నీకు అద్భుతమైన వీడ్కోలు లభించింది” అని అనుష్క తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఈ మేరకు ఆమె షేర్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ రిటైర్మెంట్‌పై దేశవ్యాప్తంగా అభిమానులు సైతం భావోద్వేగంగా స్పందిస్తున్నారు.

Read More : గెలవకపోయినా తప్పుకునేవాడినని వెల్లడన

One thought on “భార్య అనుష్క భావోద్వేగ స్పందన!

Comments are closed.