చిన్నస్వామి మైదానం చెరువుగా మారిన వీడియో వైరల్.

బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్‌ మ్యాచ్‌ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే మ్యాచ్‌కు ముందే వర్షం ఆటకు ఆటంకం కలిగించేలా ఉంది.

గురువారం బెంగళూరులో కురిసిన భారీ వర్షానికి చిన్నస్వామి స్టేడియం మైదానం పూర్తిగా నీట మునిగిపోయింది. మైదానం తీరు చెరువును తలపించేలా మారిపోవడంతో అభిమానుల్లో రేపటి మ్యాచ్‌పై అనిశ్చితి నెలకొంది. వర్షం కారణంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన వీరిలో స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే మైదానంలో నీటి మధ్య జలకేళి చేసిన టీమ్ డేవిడ్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మైదానంలో చిన్నపిల్లాడిలా నీటితో ఆడుతూ సరదాగా గడిపిన టీమ్ డేవిడ్‌ను జట్టు సభ్యులు ఉత్సాహపరిచారు. ఆర్‌సీబీ ఈ సరదా దృశ్యాలను తమ అధికారిక సోషల్ మీడియా పేజీలో షేర్ చేస్తూ “టీమ్ డేవిడ్ కాదు… స్వీమ్ డేవిడ్” అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తూ వినోదంగా షేర్ చేస్తున్నారు.

ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానున్న తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు ఈ పోరుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వర్షం తేలిపోతే మ్యాచ్ జరగడం ఖాయం. ఇక వరుణదేవుడు కరుణిస్తే అభిమానులకు కావలసిన టెన్షన్‌ఫ్రీ క్రికెట్ చూడటానికి అవకాశం ఉంటుంది.

Read More : ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మార్పుపై వివాదం

One thought on “చిన్నస్వామి మైదానం చెరువుగా మారిన వీడియో వైరల్.

Comments are closed.