టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన మతిమరుపుతో వార్తల్లో నిలిచాడు. బ్యాటింగ్‌లో తన సత్తా చాటే రోహిత్.. అప్పుడప్పుడూ పాస్‌పోర్ట్, ఫోన్, లగేజీ మర్చిపోవడం తరచుగా కనిపించే విషయం. తాజాగా కివీస్‌పై విజయం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ అలాంటి ఘటన చోటుచేసుకుంది.
కప్పు తీసుకోవడం మర్చిపోయిన రోహిత్
చాంపియన్స్ ట్రోఫీ-2025 కైవసం చేసుకున్న తర్వాత జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ పాల్గొన్నాడు. మ్యాచ్ విశేషాలు చెప్పిన తర్వాత ట్రోఫీని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో పక్కనే ఉన్న వ్యక్తి ట్రోఫీని తీసుకెళ్లి రోహిత్‌కు అందించాడు.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. “హిట్‌మ్యాన్ అస్సలు మారలేదా?”, “పోయి పోయి కప్పే మర్చిపోయాడు” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కొందరు “ఇది పెద్ద విషయం కాదు.. ట్రోఫీ స్టాఫ్ తీసుకెళ్లటం సర్వసాధారణం” అంటూ రోహిత్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఏదేమైనా భారత ఆటగాళ్లు చేసే ప్రతి చిన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

One thought on “కప్పు మర్చిపోయిన హిట్‌మ్యాన్”
Comments are closed.