టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న కమెడియన్ రచ్చ రవి తాజాగా తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్వాతికి భావోద్వేగమైన సందేశాన్ని అందించాడు. “జబర్దస్త్” కామెడీ షో ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న రవి, ఇప్పుడు టాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. తనదైన కామెడీ టైమింగ్, నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగత జీవితం కూడా చాలా ముఖ్యమని చెబుతూ, భార్య స్వాతితో తన అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన వివాహ ఫోటోలను షేర్ చేస్తూ భావోద్వేగంతో, “నిన్ను పరిచయం చేసిన నా తల్లిదండ్రుల రుణం నేను తీర్చలేను. నా జీవితంలో నీ సహాయ సహకారం ఎప్పటికీ మరచిపోలేను. ఎన్నో ఆశలు, కోరికలు, ఇష్టాలు ఉన్నాయనీ నాకు తెలుసు. కానీ, నువ్వు ఎప్పుడూ వాటిని నాతో పంచుకోలేదు. నువ్వు నా ప్రపంచానికి వెలుగు. నా విజయంలో నువ్వు ఎంతో భాగస్వామివి.” అంటూ రాశాడు.
రవి తన భార్యను పొగుడుతూ, “ఇదే జీవితంలో నీ ఆశలు, కోరికలు తీర్చాలని, అంతటి శక్తిని భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. నా ప్రేమతోనే నీ రుణాన్ని తీర్చగలనని నమ్ముతున్నా.” అంటూ పోస్ట్ చేశాడు. ఈ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలోనూ రవి యాక్టివ్గా ఉంటాడు. తరచూ తన కుటుంబానికి సంబంధించిన విషయాలను, సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను పంచుకుంటూ ఉంటాడు. తాజాగా తన భార్య స్వాతికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన భావోద్వేగ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


One thought on “కమెడియన్ రచ్చ రవి భావోద్వేగ పోస్ట్ – భార్యకు ప్రత్యేక సందేశం!”
Comments are closed.