పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’పై దేశమంతటా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభద్రతను గౌరవిస్తూ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు సైన్యానికి మద్దతుగా నిలిచారు.
పహల్గామ్‌లో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, మే 6 అర్ధరాత్రి తర్వాత భారత దళాలు తొమ్మిది కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై భారత క్రికెట్ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు.
మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, ప్రజ్ఞా ఓఝా ‘జైహింద్’ అంటూ దేశభక్తి సందేశాలను పంచుకున్నారు. IPL 2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతుగా ఒక అధికారిక ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.
ఈ ఆపరేషన్‌తో దేశవ్యాప్తంగా జాతీయవాద భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో #OperationSindoor, #JaiHind, #IndianArmy వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. సైనికుల ధైర్యసాహసానికి పౌరుల నుంచి విశేషంగా మద్దతు లభిస్తోంది.
Read More : విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు

One thought on “క్రికెట్ ప్రముఖుల నుంచి సైన్యానికి మద్దతు”
Comments are closed.